విద్యారత్న జాతీయ పురస్కారం అందుకున్న ప్రభుత్వ ఉపాద్యాయుడు సత్యనారాయణ

738చూసినవారు
విద్యారత్న జాతీయ పురస్కారం అందుకున్న ప్రభుత్వ ఉపాద్యాయుడు సత్యనారాయణ
పుడమి సాహితీ వేదిక తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన పుడమి రత్న జాతీయ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా అనుముల మండలం మర్లగడ్డ గూడెంలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆదె సత్యనారాయణ విద్యారత్న జాతీయ పురస్కారం-2022 కు ఎంపికయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ సముద్రాల వేణుగోపాల చారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా, ప్రముఖ తెలుగు పత్రికలు నమస్తే తెలంగాణ, సాక్షి లలో 50కిపైగా విద్యా సంబంధ వ్యాసాలు రచించిన విషయ నిపుణులుగా. టీశాట్(మనటీవీ) ఛానళ్ళలో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వీడియో పాఠాలు బోధించే విషయ నిపుణులుగా, తెలుగు అకాడమీ ద్వారా పోటీ పరీక్షల కోసం జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాల రచయితగా, దశాబ్ద కాలంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అందించే రిసోర్స్ పర్సన్ గా పనిచేసిన వీరి సేవలను గుర్తించి పుడమి సాహితీ వేదిక వీరికి విద్యా రత్న జాతీయ పురస్కారాన్ని అందించినట్లు ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి ప్రకటించారు.

ఇటీవలనే వీరు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, తెలుగు భాషా సంఘం, పుడమి సాహితీ సమితి సంయుక్తంగా అందించిన తెలుగు తేజం జాతీయ పురస్కారం-2022 ఎంపికయ్యారు. పుడమిరత్న జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మోడల్ స్కూల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి సరోజినీ దేవి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఏనుగుల నరసింహారెడ్డి హాజరై సత్యనారాయణ గారిని దుశ్శాలువ, మెమొంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా వీరిని రాష్ట్రోపాద్యాయ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గణపురం భీమయ్య, కొనకంచి వీర రాఘవులు మరియు పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్