స్వీట్ కార్న్‌లో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కూడా తగ్గిస్తాయి. ఇందులో క్యాలరీలు, ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల తిన్న వెంటనే మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. స్వీట్ కార్న్‌ను తినడం వల్ల కళ్లకు మంచి ఆరోగ్యం. శుక్లాలు రాకుండా ఉంటాయి. ముఖంపై ముడతలు రావు. వ్యాధినిరోధకత పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు మొక్కజొన్నను పరిమితంగానే తీసుకోవాలి.