నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామి వారికి, అమ్మవారికి పంచామృత అభిషేకం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో చేశారు. అనంతరం భక్తులు దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు.