నల్లగొండ పట్టణంలోని శ్రామిక భవన్ లో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ పట్టణ కార్యకర్తల సమావేశం బొమ్మిడి నగేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి నాయకులు ఇందూరు సాగర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలలో గత ఐదు రోజుల నుండి కురుస్తున్న భారీ, అతి భారీ, వర్షాల వల్ల మరియు కుంభవృష్టి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలకి తీవ్ర నష్టం జరిగిందని, పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు.