ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పని చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.