రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలలో దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం గ్రామానికి చెందిన పెండెం సందీప్ సత్తా చాటారు. గ్రూప్-2 ఫలితాలలో 85వ ర్యాంక్, గ్రూప్-3 లో 50వ ర్యాంకు సాధించారు. గీత కార్మికుల కుటుంబానికి చెందిన సందీప్ ఓపెన్ డిగ్రీ చదివి గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటడం పట్ల అతని తల్లిదండ్రులు శ్రీను, సాయమ్మ, గ్రామస్తులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.