నల్గొండ జిల్లా డిండిలోని దొంతిని నరసింహారావు ప్రభుత్వ కళాశాలలో బుధవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో జనరల్ ఇంటర్ విద్యార్థులు 132 మందికి గాను 128 మంది పరీక్షకు హాజరయ్యారని నలుగురు పరీక్ష రాయలేదని, ఓకేషనల్ విద్యార్థులు 76 మందికి గాను 65 మంది పరీక్షకు హాజరయ్యారని 11 మంది పరీక్ష రాయలేదని సూపరింటెండెంట్ జుర్రు పాండురంగయ్య బుధవారం తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.