నల్గొండ జిల్లా తిప్పర్తిలోని నూకలవారి గూడెంలో 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులను జననీ ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ అందజేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకూడదని, ప్రజలకు తమ వంతు సహాయంగా 5 రకాల కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సైదులు, నాగరాజు, వెంకన్న, రాజీవ్, సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.