జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

259చూసినవారు
జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
తిప్పర్తి మండల కేంద్రంలో జననీ ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ ఆధ్వర్యంలో.. ఎస్సీ కాలనీలో 200 ఇండ్లకు ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి వలన ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి లేకుండా పోయింది. ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో జననీ ఫౌండేషన్ నుంచి తమ వంతు సహాయంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంపీటీసి-1 పల్లె ఎల్లయ్య, వార్డు మెంబర్లు గిరి, భాస్కర్, జానయ్య, మనోహర్, జననీ ఫౌండేషన్ సభ్యులు సతీష్, జావీద్, లక్మణ్, బాలు, సురేష్, గౌస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్