నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల అధ్యాపకుడు డా. మిరియాల రమేష్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డును ప్రకటించింది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో పలు శాఖలో విశేషమైన సేవలు అందించిన రమేష్ కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రకటించడం పట్ల అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.