కోవిడ్ టైస్టులు పెంచండి- కరెంటు బిల్లులు కాదు: కాంగ్రెస్

259చూసినవారు
కోవిడ్ టైస్టులు పెంచండి- కరెంటు బిల్లులు కాదు: కాంగ్రెస్
తిప్పర్తి మండల కేంద్రంలో ఏఐసీసీ ఆదేశానుసారం టీపీసీసీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించి, పేదల బిల్లులు మాఫీచేయాలని విద్యుత్ కార్యాలయం మందు కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మండల విద్యుత్ అధికారికి వినతిపత్రం అందజేసారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ..కరోనా సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం. కనీస ఆదాయం కూడా లేని సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు అమాంతం పెంచి సామాన్యుని నడ్డి విరిచింది. మాది పేదల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటూనే , టీఆర్ఎస్ సర్కారు ప్రజలను పన్నులు, చార్జీల పేరుతో పీడిస్తుంది.పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి. నిరుపేదలు, చిరు వ్యాపారుల బిల్లులు మాఫీచేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ఇచ్చి రాష్ట్రంలో రైతాంగానికి జీవం పోసింది. కానీ నేడు టీఆర్ఎస్ సర్కారు మాత్రం అధిక విద్యుత్ చార్జీలు పెంచి పేదలు, రైతుల పొట్టకొడుతుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూకూరి రమేష్, తిప్పర్తి ఎంపిటీసీ-1 పల్లె యల్లయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాశం నరేష్ రెడ్డి, సర్పంచ్‌లు ఎల్లాంల సతీష్ రెడ్డి, దొంతినేని నాగేశ్వరరావు, కోన వెంకన్న, గాదె శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మనోహర్ గండమళ్ళ, వార్డు మెంబర్లు బత్తుల సోమరాజు, వంగూరి గిరి, జాకటి భాస్కర్, సీనియర్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్, తండు నర్సింహ గౌడ్, ఇంజమూరి వెంకన్న, విజయ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్