మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ ఫిక్స్డ్ పే డైలీ వేజ్ తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.