11 కేవీ విద్యుత్ లైన్ పని నిమిత్తం బుధవారం నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని డిస్కం ఆపరేషన్ నల్గొండ పట్టణ ఏడిఈ వేణుగోపాలాచార్యులు తెలిపారు. పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ రోడ్డు, మిర్యాలగూడ రోడ్, శివాలయం ఏరియాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.