నల్లగొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10: 30 రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజలు వివిధ సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. పరిశీలించిన మంత్రి అప్పటికప్పుడే పలు సమస్యలపై అధికారులకు చరవాణి ద్వారా సమాచారం అందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.