దళితులు అనే నెపంతో తొలగించడం ముమ్మాటికి కుల వివక్షతే

78చూసినవారు
దళితులు అనే నెపంతో మధ్యాహ్న భోజన వంట కార్మికులను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. శనివారం స్థానిక నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేసేటటువంటి ముగ్గురు దళిత మహిళా కార్మికులను తొలగించడం అన్యాయం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్