రెండవ ఏఎన్ఎంలు నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్‌కి బుధవారం 15వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఏఐటియుసి జిల్లాప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాఖీ కట్టి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. ప్రభుత్వం వేసిన
నోటిఫికేషన్ రద్దుచేసి తమను రెగ్యులర్ అయ్యేటట్లు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎం జిల్లానాయకురాలు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.