అంబేద్కర్ కి ఘన నివాళిలు

260చూసినవారు
అంబేద్కర్ కి ఘన నివాళిలు
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెం గ్రామంలో దళిత యువకుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ బహుజన సమాజం కోసం కృషి చేసిన మహానుభావుడని, రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అని యువత ఆయనను కొనియాడారు.‌ ఈ కార్యక్రమంలో మనోహర్ గండమళ్ళ, సంతోష్ గాలి, శ్రవణ్ కుమార్ గండమళ్ల, మధు నామ, మధు.ఎన్, వెంకన్న, సాయి, శరత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్