నల్గొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని ఎర్రగడ్డలగూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా లాక్ డౌన్‍లో రైతులు ఇబ్బందులు పడకుడదనే ఉద్దేశ్యంతో, సీఎం కేసీఆర్ రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కేంద్రాలను ఏర్పాటు చేశారని అన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలని నిర్వాహకులకు సూచించారు. కాంటా వేసే సమయంలో హమాలీలు అన్ని జాగ్రతలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్లాంల శైలజా-సతీష్ రెడ్డి, ఎంపీపీ ఎన్.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.