ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా పీఏ పల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్య కేంద్రానికి వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు, వివిధ రకాల జబ్బులతో వస్తున్న వారి వివరాలు, ప్రసవాలు, ఇతర పేషంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.