రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ పద్ధతిన అమలు చేయనున్న కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు సర్వేకై తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారితో పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.