బిజెపి పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ ఏబీఎన్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎస్ పి టి మార్కెట్లో బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బిజెపి బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.