నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మూడు, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులను అక్టోబర్ 17 లోగా చెల్లించాలని బుధవారం సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల ఆలస్య రుసుముతో అక్టోబర్ 19 వరకు చెల్లించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజుకు సంబంధించిన వివరాలు అధికారిక వెబ్సైట్లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు.