వయో వృద్ధులు లేని సమాజం ఉండదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో వారు పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెద్దల దినోత్సవం జరుపుకున్నంత మాత్రాన సరిపోదని, వారికి సరైన విలువ, గౌరవాన్ని ఇచ్చినప్పుడే అది సార్థకం అవుతుందని అన్నారు.