నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్‌గాంధీ 29 వ వర్ధంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని, నేడు మనం వాడే స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు... రాజీవ్ గాంధీ ముందుచూపు ఫలితమే అని అన్నారు. గరీబీ హటావో, పేదలకు భూముల పంపిణీ వంటి మహత్తర కార్యక్రమాలు రాజీవ్ హయాంలోనే జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, తిప్పర్తి ఎంపీటీసి-1 పల్లె ఎల్లయ్య, మర్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పాశం నరేష్ రెడ్డి, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గండమళ్ళ మనోహర్, ఆదిమూలం ప్రశాంత్, లింగంపల్లి గిరి, ఆదిమూలం సురేష్, సైదులు, చక్రి తదితరులు పాల్గొన్నారు.