హైడ్రాలో ఇళ్లు కోల్పోతున్న పేదలకు ఇళ్లు నిర్మించాలి
హైడ్రా పేరుతో తొలగిస్తున్న పేదల ఇండ్లను పునరావాసం కల్పించిన తర్వాతే తొలగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నేరేడుగొమ్ములో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడుతూ అన్యాక్రాంతమైన చెరువులను స్వాధీనం చేసుకోవడం హర్షించదగ్గ విషయమైనా పేదలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, నాగరాజు, లింగయ్య, ముత్యం తదితరులు పాల్గొన్నారు.