Jun 21, 2024, 16:06 IST/దేవరకొండ నియోజకవర్గం
దేవరకొండ నియోజకవర్గం
అనుమతులు లేని కళాశాలలను మూసివేయాలి
Jun 21, 2024, 16:06 IST
దేవరకొండ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న భవిత, సత్యసాయి ప్రవేట్ జూనియర్ కళాశాలలను మూసివేయాలంటూ శుక్రవారం ఆ కళాశాలల ఎదుట ఏబీవీపీ నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు గోపీచంద్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, హేమసుందర్, ఈశ్వర్, అరవింద్, సిదు తదితరులు పాల్గొన్నారు.