కల్తీ సారా తాగిన ఘటనలో పెరుగుతున్న మృతులు

62చూసినవారు
కల్తీ సారా తాగిన ఘటనలో పెరుగుతున్న మృతులు
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 51కి చేరింది. ఈ మేరకు తాజాగా తమిళనాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంగుమణి వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 109 మంది బాధితులు జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో వైపు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ప్రకటించింది.

సంబంధిత పోస్ట్