అనుమతులు లేని కళాశాలలను మూసివేయాలి

76చూసినవారు
అనుమతులు లేని కళాశాలలను మూసివేయాలి
దేవరకొండ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న భవిత, సత్యసాయి ప్రవేట్ జూనియర్ కళాశాలలను మూసివేయాలంటూ శుక్రవారం ఆ కళాశాలల ఎదుట ఏబీవీపీ నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు గోపీచంద్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, హేమసుందర్, ఈశ్వర్, అరవింద్, సిదు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్