ఉట్కూర్: అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయి

79చూసినవారు
ఉట్కూర్: అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయి
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు అధైర్యపడవద్దని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం ఉట్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సభ టీం సభ్యుల సన్నాహక సమావేశానికి కలెక్టర్ హాజరై పలు సూచనలు చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రేపటి నుంచి జరిగే గ్రామసభలలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు ప్రజలకు చెప్పాలని అన్నారు.

సంబంధిత పోస్ట్