అందరూ గర్వపడేలా ఆడపిల్లలు చదువులో రాణించాలని ఎంపి డికే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల వద్ద 3 కోట్ల 35 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.