జడ్చర్ల నియోజకవర్గం
మహబూబ్ నగర్: ఫిర్యాదు లను తక్షణమే పరిష్కరించాలి: ఎస్పీ జానకి
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఎస్ఐ, సిఐలకు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలన్నారు. వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు.