అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా.. సరికొత్తగా ఆలోచించే వారి కోసం చూస్తోంది. ఒక కష్టమైన సమస్యకు వారు పరిష్కారం చెప్పాల్సి ఉంది. అంటే.. చందమామ సౌత్ పోల్‌పై వ్యోమగాములు ఒంటరిగా ఉండిపోతే, వారిని ఎలా రక్షించాలో ఐడియా చెప్పాల్సి ఉంటుంది. మంచి ఐడియా చెప్పిన వారికి నాసా $20,000 (దాదాపు రూ.16.9 లక్షలు) ఇస్తుంది. మీరు ఐడియా చెప్పగలను అనుకుంటే.. ఈ ఐడియాని జనవరి 23, 2025 నాటికి https://www.herox.com లో చెప్పవచ్చు.