భారత్ బయోటెక్ తొలిసారిగా ఈ నెల 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే ఇంట్రానాసల్ కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ఒక్కో వ్యాక్సిన్ రూ.325కు, ప్రైవేట్ కేంద్రాలకు రూ.800కు విక్రయించనున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా శనివారం తెలిపారు. అలాగే, పశువుల్లో వచ్చే లంపి ప్రోవాక్ ఇండ్ కు సంబంధించిన వ్యాక్సిన్ ఫిబ్రవరిలో ప్రారంభించే అవకాశం ఉందన్నారు.