చీడపీడలను దరిచేయనీయని నవార వరి

61చూసినవారు
చీడపీడలను దరిచేయనీయని నవార వరి
నవార రకం దేశీయ వరిని ఏ ప్రాంతంలోనైనా పండించవచ్చు. ఎకరానికి 15 కిలోల విత్తనం అవసరం పడతాయి. శ్రీ పద్ధతిలో 2 కిలోలు చాలు. దిగుబడి ఎకరానికి 18-20 క్వింటాళ్ల వరకు వస్తుంది. పంటకాలం ఖరీఫ్‌లో 110-115 రోజులు, రబీలో 120-125 రోజులు. నవార అన్ని రకాల చీడపీడలను తట్టుకుంటుంది. ఈ విత్తనాలు నల్లగా, బియ్యం ఎర్రగా ఉంటాయి. నవార బియ్యం తిన్నవారిలో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఈ పంటను జూలై చివరి వరకూ విత్తుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్