నవీన్‌ పట్నాయక్‌కు ఒడిశా కాబోయే సీఎం ఆహ్వానం

53చూసినవారు
నవీన్‌ పట్నాయక్‌కు ఒడిశా కాబోయే సీఎం ఆహ్వానం
ఒడిశా నూతన సీఎంగా మోహన్‌ చరణ్‌ మాఝీ ఇవాళ సాయంత్రం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అందులో భాగంగానే ఒడిశా అవుట్‌ గోయింగ్‌ సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ను కూడా ఆహ్వానించారు. బుధవారం ఉదయం స్వయంగా నవీన్‌ పట్నాయక్‌ నివాసానికి వెళ్లిన మోహన్‌ చరణ్‌ మాఝీ.. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్