వచ్చేనెలలో 12 స్థానాలకు జరగబోయే ఎన్నికలతో అధికార ఎన్డీయే కూటమికి రాజ్యసభలో స్పష్టమైన అధిక్యం లభించేలా ఉంది. దీంతో లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ ఎన్డీయే ప్రభుత్వం బిల్లులను ఆమోదించుకునే వీలు కలగనుంది. సెప్టెంబర్ 3న జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో 12కి 11 స్థానాలను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ఎన్డీయే బలం 122కి చేరుతుంది. 241 మంది సభ్యులున్న సభలో ఆధిక్యానికి అది సరిపోతుంది.