2029లోనూ ఎన్డీఏదే విజయం: అమిత్ షా

72చూసినవారు
2029లోనూ ఎన్డీఏదే విజయం: అమిత్ షా
2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. చండీగఢ్‌లోని మణిమజ్రాలో ఓ నీటి సరఫరా చేసే ప్రాజెక్టును అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. ‘ప్రతిపక్షాలు ఏం చెప్పినా బీజేపీ నేతలు ఆందోళన చెందొద్దు. ఎందుకంటే 2029లోనే ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది. మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు. ఈ విషయంపై నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్