2012లో పానిపట్‌లో బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు నీరజ్ మణికట్టు ఎముక విరిగింది. అదే చేతితో ఆయన జావెలిన్ విసురుతాడు. ఒక దశలో ఇక ఆడలేనని అనుకున్నాడు. అయితే పట్టుదలతో ఆ గాయం నుంచి కోలుకుని మళ్లీ ఆట కొనసాగించాడు. 2019లో అదే చేతికి మళ్లీ గాయమై దాదాపు 8 నెలలు ఆటకు దూరమయ్యాడు. మళ్ళీ ఎంతో కృషి చేసి ధైర్యంగా ముందుకు సాగిన నీరజ్ టోక్యో ఒలింపిక్స్‌లో తన మొదటి గోల్డ్ మెడల్ గెలిచాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతాన్ని గెలిచాడు.