వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు విఫలం

71చూసినవారు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు విఫలం
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్లు నిర్వహించిన చర్చలు సఫలం కాలేదు. దీంతో జూడాలు సమ్మెను యధాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హాస్టల్ వసతి, పని ప్రదేశాల్లో భద్రత పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె సైర్ మోగించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ మంత్రితో జరిగిన చర్చల్లో కొన్ని అంశాలకు మాత్రమే సానుకూలత లభించిందని తెలుస్తోంది. దీంతో సమ్మెను కొనసాగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్