ఆ ఆరోపణలు కుట్రపూరితమైనవి: అదానీ

81చూసినవారు
ఆ ఆరోపణలు కుట్రపూరితమైనవి: అదానీ
అమెరికా షార్ట్‌సెల్లర్ గత ఏడాది అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలు కుట్రపూరితమైనవని ఛైర్మన్ గౌతమ్ అదానీ పునరుద్ఘాటించారు. తమ మలిదశ పబ్లిక్ ఆఫర్‌ను భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. హిండెన్‌బర్గ్ ఆరోపణల వెనక రాజకీయ శక్తులు కూడా ఉన్నాయని అదానీ ఆరోపించారు. వీటిని మీడియాలోని ఒక వర్గం మరింత ఎక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్