క్లాస్ రూమ్ లో విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వీలో చోటు చేసుకుంది. ఈ మేరకు తిరునెల్వేలిలో నీట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. కోచింగ్ సెంటర్‌లోని విద్యార్థులను దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. విద్యార్థులపై దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ.. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.