బజాజ్‌ నుంచి కొత్త పల్సర్‌ N250.. ధర ఎంతంటే?

577చూసినవారు
బజాజ్‌ నుంచి కొత్త పల్సర్‌ N250.. ధర ఎంతంటే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో మార్కెట్లోకి 2024 మోడల్‌ N250ని లాంచ్‌ చేసింది. దీని ధర రూ.1.50 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. డిజైన్‌ పరంగా పెద్దగా మార్పులు చేయనప్పటికీ.. హార్డ్‌వేర్‌, ఫీచర్ల పరంగా కొన్ని మార్పులు చేశారు. ఈ కొత్త N250లో 249cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 24 bhp, 21.5Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఫైవ్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను సెట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్