దివ్యాంగ బాలుడిని దారుణంగా కొట్టింది (వీడియో)

2601చూసినవారు
అమెరికాలోని కొలరాడోలో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లిటిల్‌టన్ పబ్లిక్ స్కూల్ ఆటిజంతో బాధపడుతున్న పదేళ్ల బాలుడిపై బస్సులో ఆయా (సహాయకురాలు) కియారా జోన్స్ దాడి చేసింది. కనికరం లేకుండా దారుణంగా ఆ బాలుడిని కొట్టింది. దీంతో బాలుడికి పన్ను, బొటను వేలు విరిగిపోయాయి. కంటికి కూడా గాయమైంది. స్కూల్ యాజమాన్యం ఆమెను తొలగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్