కుప్పకూలిన రైల్వే క్రాసింగ్ గేట్ (వీడియో)

51చూసినవారు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రద్దీగా ఉన్న ఓ రైల్వేగేట్ వద్ద అధిక సంఖ్యలో వాహనదారులు రైల్వే క్రాసింగ్ వద్ద రాకపోకలు సాగిస్తున్నారు. ఆ సమయంలో రైల్వే క్రాసింగ్ గేట్ అకస్మాత్తుగా కుప్పకూలింది. అది నేరుగా ఓ బైకర్ తలపై పడింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్