తిరుమలలో డ్యూటీలో ఉన్న ఉద్యోగులు నేమ్ ప్లేట్‌తో ఉన్న బ్యాడ్జీని ధరించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. స్వామివారి నమూనాతో కూడిన ఉద్యోగి నేమ్ ప్లేట్ బ్యాడ్జీని ఉద్యోగులు విధిగా ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ బ్యాడ్జీ ద్వారా క్యూలైన్లలో భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులను గుర్తించవచ్చని టీటీడీ భావిస్తోంది. ఈ నెల 24న జరిగే పాలకవర్గం సమావేశంలో ఈ నూతన నిర్ణయాన్ని ఆమోదించి అమల్లోకి తీసుకరానుందని తెలిసింది.