తెలుగు చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కుబేర'. ఈ చిత్రంలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడని శేఖర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. "మొదట్లో ఈ పాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించడానికి కాస్త సందేహించాను. కథను ఎంతో ఓపికగా విని వెంటనే అంగీకరించారు. ఆయన నిరాడంబరతను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది" అని శేఖర్ అన్నారు.