లడ్డూలో పొగాకు పొట్లం వార్తలను ఖండించిన టీటీడీ

64చూసినవారు
లడ్డూలో పొగాకు పొట్లం వార్తలను ఖండించిన టీటీడీ
తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఉన్నట్లు వస్తోన్న వార్తలపై టీటీడీ స్పందించింది. 'పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం' అని ప్రకటన విడుదల చేసింది. ఈ వార్తలను టీటీడీ కొట్టిపారేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్