బాసర: గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలం రేణుకాపూర్ చెరువులో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం అటుగా వెళుతున్న స్థానికులు మృతదేహాన్ని చూసి సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయడం జరిగిందని, మృతదేహం గుర్తుపట్టే విధంగా లేకపోవడంతో విచారణ జరిపి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.