గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
బాసర రైల్వే స్టేషన్ లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ పై గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. మహిళ వయస్సు సుమారు (70)సంవత్సరాలు ఉంటుందని యాచకురాలిగా భావిస్తున్న రైల్వే పోలీసులు తెలిపారు. ఆచూకి తెలిస్తే బాసర రైల్వే పోలీస్ స్టేషన్ జీ ఆర్ పి రైల్వే హెడ్ కానిస్టేబుల్ జాన్ ను సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.