ఉద్యోగం సాధించిన మహిళకు సన్మానం

55చూసినవారు
ఉద్యోగం సాధించిన మహిళకు సన్మానం
వ్యవసాయ అధికారిగా ఉద్యోగం సాధించిన జన్నారం పట్టణానికి చెందిన స్పందనను డిప్యూటీ కలెక్టర్ చిత్ర పటేల్ సన్మానించారు. జన్నారం పట్టణానికి చెందిన హాజీపూర్ తాసిల్దార్ రాజలింగం కుమార్తె స్పందన ఇటీవల విడుదలైన అగ్రికల్చర్ ఆఫీసర్ ఫలితాలలో ఉద్యోగాన్ని సాధించారు. ఆదివారం ఆయన జన్నారం పట్టణానికి వచ్చి ఉద్యోగం సాధించిన స్పందనను అభినందించి సన్మానించారు. యువత పట్టుదలతో కృషి చేస్తే జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్